నాకు ఆ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటున్న మంగ్లీ
on Feb 15, 2025
స్టార్ సింగర్ 'మంగ్లీ'(Mangli)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.ఆమె గాత్రం నుంచి వస్తున్న ఎన్నోసినీ,ప్రవైట్ గీతాలు సంగీత ప్రియులని ఉర్రుతలూగిస్తు వస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం మంగ్లీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన అరసవెల్లి సూర్య నారాయణ స్వామిని దర్శించుకుంది.దీంతో ఒక రాజకీయ పార్టీకి చెందిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా మంగ్లీ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయంపై మంగ్లీ మాట్లాడుతు' నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.2019 ఎన్నికలకి ముందు వై ఎస్ ఆర్ సిపీ పార్టీకి పాడాను.అలా పాడటం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కోవడంతో పాటు అవకాశాలు కూడా కోల్పోయాను.వేరే పార్టీ కి చెందిన కొంత మంది లీడర్స్ కి కూడా పాడాను.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారికి నేను పాడనని చెప్పానని,2019 కి సంబంధించిన వీడియో క్లిప్ లతో,కొంత మంది ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..ఆయన దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక పేరు ఉన్న వ్యక్తి.నాకు ఎలాంటి రాజకీయ పక్ష పాతాలు లేవు,నా పాటకి రాజకీయ రంగు పులమద్దు.అన్నిటికంటే నాకు పాటే ముఖ్యం అంటు 'మంగ్లీ' ఒక బహిరంగ లేఖని విడుదల చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
