బంగారు కోడిపెట్టలో సమంత
on Jul 3, 2013
నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "బంగారు కోడిపెట్ట". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరోయిన్ సమంత రానుంది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు వెళ్లి సమంతను కోరగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. గురు ఫిల్మ్స్ బ్యానర్ లో సునీత తాటి నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ పిప్పల్ల దర్శకత్వం వహించారు. మహేష్ శంకర్ సంగీతం అందించారు.