గీత గోవిందం దర్శకుడితో విష్ణు
on Aug 17, 2018

పరశురామ్ 'యువత' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.. ఆ తరువాత ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.. రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' ఘన విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. దీంతో పరశురామ్ తరువాతి సినిమా ఎవరితో అంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి.. అయితే పరశురామ్ మంచు విష్ణుతో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ‘శ్రీరస్తు శుభమస్తు’ సమయంలోనే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో ఓ సినిమా చేయడానికి పరశురామ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం విష్ణు ఓటర్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా అనంతరం విష్ణు, పరశురామ్ ల సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



