![]() |
![]() |

బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో మునిగిన అతని కుటుంబానికి వెంటనే మరో షాక్ తగిలింది. అతని వదిన సోమవారం బిహార్‌లోని పూర్ణియాలో మృతి చెందారు. సుశాంత్ మరణాన్ని అతని కజిన్ భార్య సుధాదేవి జీర్ణించుకోలేకపోయారని సమాచారం. ఒకవైపు సోమవారం సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే కబురు తెలిసినప్పట్నుంచీ సుధాదేవి ఆహారం తీసుకోవడం మానేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల విషాదానికి అంతు లేకుండా పోయింది.
కాగా భారీ వర్షం మధ్యే సోమవారం సాయంత్రం ముంబై, విలే పార్లే ప్రాంతంలోని పవన్ హాన్స్ శ్మశానంలో సుశాంత్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. శ్రద్ధా కపూర్, కృతి సనన్, ఏక్తా కపూర్, వివేక్ ఓబరాయ్, రణదీప్ హూడా, ప్రతీక్ బబ్బర్, ఉదిత్ నారాయణ్, సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి తదితరులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
![]() |
![]() |