TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

బొత్స ఇలాకాలో వైసీపీ జీరో: వలసలు, సస్పెన్షన్లు.. అసలేం జరుగుతోంది.?

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు. పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు. సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ పార్టీ నుంచే సస్పెండ్ చేసింది. స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు. [YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]

Published on: Sat Oct 3, 2026 2:55PM

political-news-img

Vasthava Vedika: ఏపీ రాజకీయాల్లో కొత్త వ్యూహాలు..జగన్ స్కెచ్ వెనుక అసలు కథ ఏమిటి .?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల కదలికలు, అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర రాజకీయాలను నిత్యం వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న నూతన రాజకీయ వ్యూహాలు, ఆయన అడుగులు ఏ విధంగా మారుతున్నాయనే అంశంపై రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు ఆసక్తికర అంశాలపై చర్చించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్ తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో నిత్యం ఉండేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు నాయకత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ప్రజాక్షేత్రంలో గళం విప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ పథకాల అమలుతీరు, ఎన్నికల హామీల వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌‌సీపీ అడుగులు వేస్తోంది. జగన్ ప్రవేశపెడుతున్న ఈ కొత్త స్కెచ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలను రూపొందించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగాలు. ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చిన రాజకీయ వెనకడుగును అధిగమించడానికి, నాయకత్వ శైలిలోనూ, ప్రజా సమస్యల స్పందనలోనూ మార్పులు తీసుకువస్తున్నారు. ఈ వ్యూహం వల్ల పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండినప్పటికీ, అధికార పక్షం నుంచి వచ్చే ప్రతిఘటనను సమర్థవంతంగా ఎదుర్కొనే సవాలు కూడా జగన్ ఎదుట నిలిచింది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పార్టీ భావిస్తోంది. ఈ రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రానున్న కాలంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. జగన్ అనుసరిస్తున్న కొత్త రాజకీయ వ్యూహాలు ఫలితమిస్తే, అది రాష్ట్రంలో బలమైన ద్విముఖ పోరుకు దారితీసే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతమవుతాయనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ, ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల లేదా భవిష్యత్ ఎన్నికలపై గణనీయమైన ముద్ర వేయడం ఖాయం. [ Vasthava Vedika, Kanthamaneni Ravi Shankar, Dolendra Prasad, TOne News, Telugu one, YSJagan, CM Chandrababu, Naralokesh, YSRCP, TDP, Telugu One, Telugu News ]

Published on: Thu Oct 1, 2026 9:11PM

political-news-img

మీడియా సమావేశాల్లో జగన్ బోరింగ్.. విజయసాయి ఇంట్రెస్టింగ్.!

కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి, వరుస ప్రెస్ మీట్లతో ఒకదాని వెంట ఒకటిగా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన విషయం, ప్రస్తావించిన అంశం, వెల్లడించిన వివరాలను అలా ఉంచితే.. పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే.. వైసీపీ అధినేత జగన్‌ సమావేశాల కంటే సాయిరెడ్డి ప్రెస్‌మీట్లే ప్రజల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివిధ అంశాలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడమే కాకుండా, గణాంకాలు, పోలికలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటారు. దీంతో ఆయన విలేకరుల సమావేశాలు సాగదీతగా, రొడ్డకొట్టుడు ప్రసంగాలుగా మీడియా ప్రతినిథులు చెబుతుంటారు. అంతే కాకుండా జగన్ ప్రెస్ మీట్లలో గణాంకాల విషయంలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ సర్వసాధారణమి చెబుతారు.దీంతో ఆయన మాట్లాడే విషయంలోని తప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడమే కాకుండా, జగన్ ను కూడా ట్రోల్ మెటీరియల్ గా మర్చేస్తుండటం కద్దు. అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు రంజుగా, పసందుగా, పదునుగా, స్ట్రాటజిక్ గా సాగుతుంటాయి. గణాంకాల జోలికి పోకుండా, ప్రజలను, మీడియాను ఇట్టే ఆకట్టుకునే సంచలన రాజకీయ విమర్శలకు విజయసాయి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం, మత మార్పిడులు, వైసీపీలో సజ్జల ఆధిపత్యం, పార్టీలో అంతర్గతంగా ఆయన సాగిస్తున్న అరాచకం, తననే స్వయంగా కొట్టారంటూ సజ్జలపై సంచలన ఆరోపణలు, విశాఖపట్నం వర్సెస్ మావిగున్ వంటి వాటిని ఆయన ప్రస్తావిస్తూ, ఇటు మీడియానూ, అటు ప్రజలనూ ఏకకాలంలో ఆకట్టుకోగలుగుతున్నారు. అన్నిటికీ మించి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ కు సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను సహజంగా జనం నమ్ముతున్నారు. కేవలం సంచలన వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, అందులో వాస్తవం ఉండే ఉంటుందన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే జనం విజయసాయి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారు? అని ఆసక్తిగా చూస్తున్నారు. [Vijayasai Reddy Jagan, AP Politics, Visakhapatnam, Press meet, YSR Congress Party, Vijayasai, New Party, Telugu One]

Published on: Thu Oct 1, 2026 12:46PM

political-news-img

వైసీపీలో పేర్ని నాని సీన్ అయిపోయిందా: కార్యకర్తల సమావేశంలో అసహనం సంకేతం ఏంటి.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు. అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు. విషయమేంటంటే.. ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది. అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు. [Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]

Published on: Thu Oct 1, 2026 12:02PM

political-news-img

తెలుగుదేశం కూటమికే జనం జై: అయితే, ఆ సమస్యలు అధిగమించాలి.. చాణక్య స్ట్రాటజీస్ సర్వే.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా రాజకీయ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ప్రజాభిప్రాయం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన, కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన బీజేపీ మధ్య సమన్వయం, వైసీపీ బలం వంటి పలు అంశాలను పరిశీలించినట్లు చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వేలోని అంశాలు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా.. కూటమి పాలనపై ప్రజాల అభిప్రాయం, జనం మూడ్ ఎలా ఉందన్న అంశాన్ని తాజా సర్వే పరిశీలించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, జాబ్ క్యాలెండర్, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి నాయకత్వం, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, నెల నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ వంటి అంశాలు ప్రజలకు చేరుతున్నాయని సర్వే పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ పంపిణీ సమయంలో కనిపించిన ప్రచార స్థాయి ఇప్పుడు కనిపించడం లేదన్న అభిప్రాయం జనంలో వ్యక్తమౌతోంది. ఇక తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ కూటమి నేతలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితంలో వెల్లడైంది. అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రభుత్వంపై వైసీపీయులు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ తెలుగుదేశం వినా, కటమిలోని మిగిలిన రెండు భాగస్వామ్య పార్టీల నేతలూ పెద్దగా ముందుకు రావడం లేదన్న అభిప్రాయం కూడా ఈ సర్వేలో తేటతెల్లమైంది. జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని సర్వే స్పష్టం చేసింది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం ప్రజల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రం క్షేత్రస్థాయిలో జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది. ఇసుక, మట్టి, ఇతర స్థానిక వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లపై వస్తున్న ఫిర్యాదులు, చిన్న చిన్న ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో ప్రజలలో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు వాస్తవంగా ఎప్పుడు ప్రారంభమవుతాయన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోందని సర్వే పేర్కొంది. కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినప్పటికీ.. అనేక చోట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. అమరావతి నిర్మాణ పనులకు ప్రతిరోజూ అప్‌డేట్లు వస్తున్నట్టే.. పరిశ్రమలు, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తే విశ్వాసం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. శంకుస్థాపనలు ఎప్పుడు పూర్తవుతాయి.. పరిశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నలకు జనం సమాధానం కోరుకుంటున్నారని తేలింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెమ్మదించిన పలు సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందన్న అంశాన్ని కూడా సర్వే ప్రస్తావించింది. వెలిగొండ, పోలవరం ఎడమ గట్టు కాలువ, కుప్పం ప్రాంతానికి తాగు, సాగునీరు, పులివెందులకు తాగునీరు అందించే ప్రాజెక్టులు వంటి వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని పేర్కొంది. అయితే ఈ పనుల గురించి ప్రజల్లోకి బలంగా వెళ్లే స్థాయిలో ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం అధికార కూటమికి ఇబ్బందికరంగా మారుతోందని సర్వే విశ్లేషించింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని, వాటికి దీటుగా కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం, కూటమి భాగస్వామ్య పార్టీలో విఫలమౌతున్నాయని సర్వే తేల్చింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీలలో కీలకమైన జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలపై జరుగుతున్న ప్రచారం కూడా జనంలో చర్చనీయాంశంగా మారిందని సర్వే పేర్కొంది. వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా వలసలు జరుగుతుండటం ఆ అభిప్రాయానికి కారణంగా సర్వే పేర్కొంది. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న కాలంలో.. స్థానికంగా టీడీపీ నాయకులతో రాజకీయంగా తలపడిన నేతలు జనసేనలో చేరుతుండటం, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో ముందుముందు జనసేన సమన్వయం దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం, ఆందోళన అయా ప్రాంతాలలోని స్థానికులలో బలంగా వ్యక్తమౌతోందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. మరీ ముఖ్యంగా ఈ పరిస్థితి స్థానిక ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక తెలుగుదేశం సీనియర్ నాయకులకు, మంత్రి నారా లోకేష్‌కు మధ్య సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా సర్వేలో పరిశీలించింది. పార్టీలో సీనియర్లకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత ప్రస్తుతం లేదన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉందని పేర్కొంది. కీలక పదవులు, నిర్ణయాల్లో సీనియర్ల అభిప్రాయాలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి కూడా ఉందని తెలిపింది. అదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేష్ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వంటి ప్రచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోందని సర్వే పేర్కొంది. అయితే బహిరంగంగా మాత్రం ఇరువురు నేతలు కూటమి కొనసాగుతుందని చెబుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ తరహా ప్రచారానికి కూటమి అగ్రనాయకత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూటమి ఐక్యతపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. ఇక వైసీపీ విషయానికి వస్తు.. వైసీపీ, కూటమి మధ్య అంతరం తగ్గుతోందన్న అభిప్రాయం ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాల్లో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. కడప జిల్లాలో కమలాపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని తెలిపింది. కర్నూలు జిల్లాలోనూ కూటమి నాయకులు ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న అసంతృప్తి ప్రజలలో బలంగా వ్యక్తమైందని సర్వే పేర్కొంది. కూటమి వైఫల్యాలను వైసీపీ నిర్మాణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందన్న విశ్లేషణను సర్వే చేసింది. అయితే ఇది సర్వే సంస్థ అభిప్రాయం మాత్రమేనని, వాస్తవ ఎన్నికల ఫలితాలను ముందుగానే నిర్ణయించే అంశంగా చూడలేమని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. అలాగే స్థానిక ఎన్నికల విషయానికి వస్తే.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాట్లే కీలకమని సర్వే పేర్కొంది. జనసేన నాయకులు ఎక్కువ సంఖ్యలో స్థానాలను కోరుతున్నారని, రోవైపు ఇప్పటికే గ్రామస్థాయిలో తమకు బలమైన పట్టు ఉందని భావిస్తున్న టీడీపీ నాయకులు సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న అభిప్రాయం కూడా ప్రజలలో ఉందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన నాయకత్వం క్షేత్రస్థాయిలో విభేదాలను ముందుగానే పరిష్కరించకపోతే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని సర్వే విశ్లేషించింది. గతంలో పరస్పరం పోటీ చేసిన లేదా విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం కూడా కూటమికి కీలక సవాలుగా మారనుందని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వేలో కూటమి ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం, పెట్టుబడుల అమలు, జనసేనలో చేరికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం వంటి అంశాలు కీలకంగా మారుతున్నట్లు పేర్కొంది. ఈ అంశాలను కూటమి నాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారనుంది. [AP Political Survey, Chanakya Strategies Survey, AP Political Survey, Chandrababu, TDP, Janasena, BJP, YCP, AP Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]

Published on: Thu Oct 1, 2026 10:27AM

political-news-img

ఖైరతాబాద్ బరిలో జనసేన: బీజేపీ ఓట్లకు గండేనా?

తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. ఒకవైపు శాసనమండలి ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక రాజకీయాలను వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా, తాజాగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరి నిలిచేందుకు సై అంటున్నది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయం రసకందాయంలో పడింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సత్తా చాటుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. . ఇక భారతీయ జనతా పార్టీ సైతంఖైరతాబాద్ లో విజయం సాధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉనికిని చాటుకోవడానికి శ్రమిస్తోంది. ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ప్రారంభించాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ బైపోల్‌‌లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఏదో నామ మాత్రపు పోటీ మాదిరిగా కాకుండా.. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని భావిస్తోంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తగిన అంగబలంతో పాటు ఆర్థిక బలం ఉన్న బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులో ఉండటమే కాకుండా, అధికారంలో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయితే తెలంగాణ కు వచ్చే సరికి మాత్రం బీజేపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయని చెబుతున్నాయి. ఇదే జరిగితే జనసేన పోటీ బీజీపీ ఓట్లకు గండి కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ (కల్వకుంట్ల కవిత) బరిలో ఉండటం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందేనని చెబుతున్నారు. [Janasena, Khairatabad Bypoll, Telangana Politics, Khairatabad Assembly Election, Pawan Kalyan, Danam Nagender Disqualification, Kalvakuntla, Kavita, Trs, Telugu One]

Published on: Wed Sep 30, 2026 3:21PM