![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంతిమ కార్యక్రమాలు ప్రారంభం కాకమునుపే ముంబైను భారీ వర్షం తాకింది. మన తెలుగులో 'తూనీగా తూనీగా' సహా హిందీలో 'జిలేబీ'లో కథానాయికగా, 'హాఫ్ గాళ్ ఫ్రెండ్', 'బ్యాంక్ చోర్' తదితర చిత్రాల్లో నటించిన బెంగాలీ భామ రియా చక్రవర్తితో అతడు ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కి శవపరీక్ష నిర్వహించిన ఆసుపత్రికి వెళ్లిన రియా చక్రవర్తి, కడసారి అతడిని చూసుకుంది. కన్నీటితో తుది వీడ్కోలు పలుకుతూ ఆసుపత్రిని వీడింది. అతడి పార్థీవ దేహాన్ని ఆసుపత్రి నుండి నేరుగా శ్మశాన వాటికకు తీసుకొచ్చారు.

ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో సుమారు 4.45 సుశాంత్ అంతిమ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. అప్పటికి హీరోయిన్లు శ్రద్ధా కపూర్, క్రితి సనన్, హీరో వివేక్ ఒబెరాయ్, నటుడు రణవీర్ షోరే, నిర్మాత ఏక్తా కపూర్, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా తదితరులు అక్కడికి చేరుకున్నారు. సుశాంత్ తండ్రి, అతడి సిస్టర్స్ అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. ఐదు గంటలకు అవి పూర్తయ్యాయి. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ హీరోయిన్లు, ఇతరులు కార్యక్రమలు అన్నీ పూర్తయ్యేవరకు ఉండి, వెళ్లారు. సుశాంత్ కి కడసారి నివాళులు అర్పించారు.
.jpg)
![]() |
![]() |