![]() |
![]() |

ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, హలో, టిక్ టాక్... వీటితో పాటు మనకు చాలా సోషల్ మీడియా సైట్లు ఉన్నాయి. సోషల్ మీడియా ఓ ఊహాజనిత ప్రపంచం. అందులో ఎంత మంది ఫాలోయర్లు ఉన్నా లాభం లేదని, మనం ఒంటరే అని కథానాయిక ప్రణీత సుభాష్ చెబుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతాన్ని అందుకు ఉదాహరణగా చూపెడుతోంది.
"ఇన్ స్టాగ్రామ్ లో 9.8 మిలియన్ ఫాలోయర్లు, ట్విట్టర్ లో 1.8 మిలియన్ ఫాలోయర్లు ఉన్న వ్యక్తి ఒంటరిగా మిగిలాడు. అది అర్థం చేసుకోండి. ఊహాజనిత ప్రపంచమంతా ఫేక్" అని ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉద్దేశించే ఆమె ఆ పోస్ట్ చేశారనేది చాలా సులభంగా అర్థమవుతోంది. మెంటల్ డిప్రెషన్ కారణంగా సుశాంత్ మరణించాడని పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ధృవీకరించిన నేపథ్యంలో... తన మానసిక సమస్యలను అతను ఎవరికీ చెప్పుకోలేకపోయాడని అర్థమవుతుంది. సోషల్ మీడియాలో అంతమంది ఫాలోవర్ లో ఉన్న ఏం లాభమని అర్థం ప్రణీత సుభాష్ మాటల్లో వ్యక్తమవుతోంది. ఆమె పోస్ట్ చేసిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో అతని ఫాలోయర్స్ సంఖ్య 11.2 మిలియన్స్ కి, ట్విట్టర్లో 1.9 మిలియన్స్ కి చేరుకుంది.
![]() |
![]() |