![]() |
![]() |

బాలీవుడ్ తార, 'ఆర్ఆర్ఆర్' మూవీలో రామ్‌చరణ్ జోడీగా నటిస్తోన్న అలియా భట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఆదివారం తన నివాసంలో మృతి చెందిన రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నివాళులర్పిస్తూ ఆమె చేసిన ఎమోషనల్ ట్వీట్ దీనికి కారణం. అదేంటని ఆశ్చర్యపోతున్నారా! దానికో కారణం ఉంది. గతంలో ఆమె 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో సుశాంత్‌పై అవమానకరంగా కామెంట్ చేసింది. ఆ షోలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్‌లకు రేటింగ్ ఇవ్వమని అలియాను అడిగాడు కరణ్ జోహార్. అందుకు "సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఎవరు?" అని ఆశ్చర్యపోతున్నట్లు అడిగింది అలియా. ఆమె చేసిన ఆ కామెంట్‌ను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న సుశాంత్‌సింగ్ ఫ్యాన్స్ దాన్ని అలియా చేసిన తాజా ట్వీట్‌కు ఫ్లాగ్ చేస్తున్నారు.
"I’m in a deep state of shock. No matter how much I think about it, I don’t have the words. I’m totally devastated. You've left us too soon. You will be missed by each and every one of us. My deepest condolences to Sushant's family, loved ones, and his fans." అని ట్విట్టర్ ద్వారా నివాళులర్పించింది అలియా. "అప్పుడేమో సుశాంత్ ఎవరు? అని అతడిని అవమానించి, ఇప్పుడేమో షాక్ తిన్నానని ట్వీట్ చేస్తావా?" అని చాలా మంది ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్‌ను అప్పుడలా అన్నందుకు ఆమె క్షమాపణలు చెబుతుందేమో చూడాలి.
![]() |
![]() |