![]() |
![]() |

లాక్‌డౌన్ తర్వాత పెళ్లి పనులు ప్రారంభించడం కంటే... ముందుగా సినిమాలు పనులు ప్రారంభించాలని యంగ్ హీరో నితిన్ భావిస్తున్నాడట. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'రంగ్ దే', చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటిస్తున్న 'చెక్' షూటింగులు కొంత వరకు జరిగాయి. కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.
'భీష్మ' తర్వాత పెళ్లి కోసం కొన్ని రోజులు సినిమాలు, షూటింగులకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు నితిన్. కరోనా అతడికి అంతకంటే పెద్ద బ్రేక్ ఇచ్చింది. లాక్‌డౌన్‌లో సర్వం బంద్ కావడంతో అటు పెళ్లి.. ఇటు షూటింగులు... రెండూ జరగలేదు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం, షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో మెల్లగా సినిమా షూటింగులు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్స్ స్టార్ట్ చేసి, మధ్యలో ఆపిన 'రంగ్ దే', 'చెక్' కంప్లీట్ చేస్తే నిర్మాతలకు మేలు జరుగుతుందని నితిన్ అనుకుంటున్నాడని టాక్. ముందు ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి, తర్వాత పెళ్లి చేసుకోవాలనేది ప్లాన్ అట.
![]() |
![]() |