![]() |
![]() |

కీర్తీ సురేష్ అంటే మహానటి, మహానటి అంటే కీర్తీ సురేష్ అన్నంతగా తెలుగునాట ప్రేక్షకుల్లో బలమైన ముద్రపడింది. ఆ సినిమా ప్రభావం అటువంటిది మరి. 'మహానటి' తర్వాత తెలుగులో కీర్తీ సురేష్ మరో సినిమా చేయలేదు. అనువాద సినిమాలతో అడపాదడపా పలకరించింది. మళ్ళీ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'పెంగ్విన్'తో ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు అయినప్పటికీ... ప్రస్తుత పరిస్థితులో సినిమా విడుదలవుతుందనే సంతోషమే ఎక్కువ ఉందని కీర్తీ సురేష్ చెప్పింది. థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమా చూసే ప్రేక్షకులు ఎక్కువమంది ఉంటారనీ, ఓటీటీ ద్వారా కొత్త ప్రేక్షకులకు చేరువ అవుతామని ఆమె తెలిపింది.
ప్రస్తుతం తెలుగులో 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి', 'రంగ్ దే' సినిమాల్లో కీర్తీ సురేష్ నటిస్తోంది. మరో రెండు నెలలు ఇంట్లో బందీగా ఉంటాననీ, ఇప్పట్లో షూటింగులకు హాజరుకాలేనని ఆమె చెబుతోంది. "కరోనా ప్రభావం తగ్గలేదు. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు షూటింగులు అంటే భయంగా ఉంది. అందుకని, మరో నెల లేదా రెండు నెలల తర్వాత బాహాటకు వెళదామని అనుకుంటున్నాను. సెట్ లో ఎంత జాగ్రత్తగా ఉంటామనేది సందేహమే" అని కీర్తీ సురేష్ స్పష్టం చేసింది.
![]() |
![]() |