![]() |
![]() |
.jpg)
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'. కరోనా అందరి కాళ్లు చేతులు కట్టేయకపోతే ఇప్పటికి సినిమా చాలావరకూ పూర్తయ్యేది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపులో భాగంగా షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో 'పుష్ప' షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే, ముందుగా అనుకున్నట్టు అడవుల్లో ఫైట్ సీన్స్ కాకుండా సాంగ్స్ తీయాలని సుకుమార్ కొత్త ప్లాన్ వేశారని టాక్. ఫైట్స్ తీయాలంటే హీరోతో సహా ఫైటర్లు ఎక్కువమంది కావాలి. లొకేషన్ లో జనాలు చాలామంది ఉంటారు. ఫైట్స్ తీసేటప్పుడు భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుంది. సాంగ్స్ అయితే తక్కువమందితో క్రియేటివిటీ చూపిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తీయవచ్చని సుకుమార్ ముందు సాంగ్స్ ప్లాన్ చేశారట.
ఒకవైపు కరోనా టెన్షన్... మరోవైపు షూటింగులు చేయడానికి ప్రభుత్వం విధించిన కండిషన్స్... రెండిటి నడుమ సేఫ్టీగా షూటింగ్ చేయడానికి ఇండస్ట్రీ కొత్త దారులు వెతుకుతోంది. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని హీరోలు షూటింగులను వాయిదా వేస్తున్నారు. హీరోలు రెడీగా ఉండటంతో కొందరు ఇలా కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఆల్రెడీ రవిబాబు 'క్రష్' షూటింగ్ స్టార్ట్ చేశారు. మరికొన్ని సీరియళ్లు, వెబ్ సిరీస్ షూటింగులు కూడా స్టార్ట్ అయ్యాయి.
![]() |
![]() |