![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా రూపొందిన 'సూరారై పొట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా')తో దర్శకురాలు సుధ కొంగర స్థాయి మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె తన తదుపరి చిత్రాల కోసం స్క్రిప్ట్స్ తయారు చేసుకునే పనిలో ఉన్నారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రస్తుతం సుధ రెండు స్క్రిప్టులతో బిజీగా ఉన్నారని తెలిసింది. అందులో ఒకటి సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసమని టాక్.
అంతేకాదు.. దీన్నో మల్టిలింగ్వల్ ప్రాజెక్ట్ గా ఆమె డిజైన్ చేస్తున్నారని.. స్క్రిప్ట్ పూర్తయ్యాక మహేశ్‌కి వినిపించే దిశగా ప్రణాళిక జరుగుతోందని వినికిడి. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ నిమిత్తం మహేశ్ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక సుధ కొంగర ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరిగే అవకాశముందని అంటున్నారు.
అంతేకాదు.. కోలీవుడ్ స్టార్ అజిత్ కోసం కూడా సుధ కొంగర స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని.. ఇది కూడా ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో కూడినదే అని తమిళ చిత్ర వర్గాల సమాచారం. మరి.. వీటిలో ఏ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |