![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్.. ఈ సంక్రాంతికి విడుదలైన 'అల్లుడు అదుర్స్' కోసం తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఐటమ్ నంబర్ చేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. "రంభ ఊర్వశి మేనక" అంటూ సాగిన మోనాల్ ప్రత్యేక గీతం మాత్రం కుర్రకారుని ఫిదా చేసింది. కట్ చేస్తే.. మరో డాన్స్ నంబర్ లో చిందేసే అవకాశం మోనాల్ కి దక్కిందట. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో!
ఆ వివరాల్లోకి వెళితే.. మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్‌కి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. అక్కడి భారీ షెడ్యూల్ కాగానే యూనిట్ హైదరాబాద్ వస్తుందట. హైదరాబాద్ షెడ్యూల్ లో తొలుత ఐటమ్ సాంగ్‌ని చేస్తారని, ఆ పాటలోనే మోనాల్ దర్శనమివ్వనుందని టాక్. త్వరలోనే 'సర్కారు వారి పాట'లో మోనాల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |