![]() |
![]() |

'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేష్' రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ స్కోర్ చేశారు యువ కథానాయకుడు వరుణ్ తేజ్. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా 'గని' చేస్తున్నారు. అలాగే 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా రూపొందుతున్న 'ఎఫ్ 3'లో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు కూడా నెల రోజుల వ్యవధిలో వెండితెరపై వినోదాలు పంచనున్నాయి.
కాగా, తాజాగా వరుణ్ తేజ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 'గరుడవేగ' చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వరుణ్ తన నెక్ట్స్ వెంచర్ చేయబోతున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. లండన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని టాక్. త్వరలోనే వరుణ్, ప్రవీణ్ కాంబినేషన్ మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |