![]() |
![]() |

ప్రస్తుతం తెలుగునాట ఇద్దరు యువ సంగీత దర్శకుల హవా నడుస్తోంది. ఆ ఇద్దరే.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, యువ సంగీత సంచలనం తమన్. వృత్తిగతంగా పోటీదారులే అయినా.. వ్యక్తిగతంగా ఈ ఇద్దరూ మంచి స్నేహితులే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మే 28న ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ కంపోజర్స్ తమ కొత్త చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు కూడా బిగ్ టికెట్ ఫిల్మ్స్ కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'బీబీ3' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న హ్యాట్రిక్ ఎటెంప్ట్ మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది. దీనికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఇక అదే రోజున మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'ఖిలాడి' రాబోతోంది. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
మరి.. ఒకే రోజున బరిలోకి దిగుతున్న ఈ అగ్ర స్వరకర్తల్లో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి.
![]() |
![]() |