![]() |
![]() |

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్నచిత్రం 'ఇదే మా కథ'. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నఈ చిత్రానికి 'రైడర్స్ స్టోరీ' అనేది ఉపశీర్షిక. గురుపవన్ దర్శకుడు. ఎన్. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పిస్తున్నారు.
ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన 'ఇదే మా కథ' టీజర్‌కు అన్ని వైపుల నుంచీ ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. నిజానికి ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. విజువల్స్ అమేజింగ్‌గా ఉన్నాయనీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందిందనే అభిప్రాయం కలుగుతోందనీ అందరూ అభినందిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో అజిత్ సైతం ఈ టీజర్ చూసి, ప్రశంసలు తెలపడం విశేషం. టీజర్‌పై ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, "నా చిరకాల మిత్రుడు సి. రామ్‌ప్రసాద్ (సినిమాటోగ్రాఫర్) ఇదే మా కథ ఫిల్మ్ టీజర్‌ను చూపించారు. ఆ టీజర్‌ను చూడగానే బాగా ఇష్టపడ్డాను. అందులోని విజువల్స్‌తో పాటు ఆ ఫిల్మ్‌ను చిత్రీకరించిన తీరు బాగా నచ్చింది. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ టీజర్‌తో తక్షణమే కనెక్ట్ అయ్యాను. త్వరలో మీ అందరినీ వ్యక్తిగతంగా కలుసుకుంటానని ఆశిస్తున్నాను. టీమ్ మొత్తానికి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
దర్శక నిర్మాతలు గురుపవన్, జి. మహేష్ మాట్లాడుతూ, "అజిత్ కుమార్ గారు మా 'ఇదే మా కథ' టీజర్ చూసి, ఫోన్ చేసి ప్రశంసించడం మా టీమ్ మొత్తానికి అమితానందాన్ని కలిగించింది. ఆ స్థాయిలో ఉన్న సూపర్‌స్టార్ నుంచి అలాంటి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం మాకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వడంతో పాటు సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. సూపర్‌స్టార్ అయినప్పటికీ అజిత్ కుమార్ గారిది గోల్డెన్ హార్ట్, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. మా టీజర్‌పై ఇంత మంచి అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయనకు మా టీమ్ తరపున మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని సాధ్యం చేసిన మా సూపర్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ సి. రామ్‌ప్రసాద్ గారికి థ్యాంక్స్" అన్నారు.

![]() |
![]() |