![]() |
![]() |

డైరెక్టర్ శంకర్.. ఈ పేరు దేశ వ్యాప్తంగా తెలియని సినీ ప్రియులు లేరు. జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, రోబో వంటి భారీ చిత్రాలతో దేశ వ్యాప్తంగా ది గ్రేట్ డైరెక్టర్‌గా శంకర్ పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ వుంటుంది. అలాంటి దర్శకుడిపై నాన్ ఎయిలెబుల్ వారెంట్ ఇష్యూ కావడం తమిళ నాట సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. 2010లో శంకర్ తెరకెక్కించిన టెక్నికల్ వండర్ 'రోబో'. తమిళంలో 'ఎందిరన్'` పేరుతో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇండియాన్ తెరపై హాలీవుడ్ ఫిల్మ్ అనే స్థాయిలో ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దర్శకుడిగా శంకర్‌కు ఈ చిత్రం మంచి పేరుని తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ ద్వారా ఆయన వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఈ చిత్ర కథని 1996 లో తమిళ పత్రికలో మొదటిసారి ప్రచురించబడిన 'జిగుబా' అనే తన కథని శంకర్ కాపీ చేశారంటూ రచయిత అరుర్ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు పలు మార్లు శంకర్‌ని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ శంకర్ మాత్రం స్పందించకపోవడమే కాకుండా కోర్టు ముందు హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శంకర్‌పై నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ ని ఇష్యూ చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ శంకర్ కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇంత వరకు దర్శకుడు శంకర్ పెదవి విప్పలేదు.
![]() |
![]() |