![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 25 చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. త్వరలో తన 26వ సినిమా 'వకీల్ సాబ్'తో పలకరించనున్నారు. ఏప్రిల్ 9న ఈ కోర్ట్ డ్రామా జనం ముందుకు రానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఏప్రిల్ నెలలో విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ 7వ సినిమా ఇది. తనకు సంబంధించి ఇదో రికార్డ్ అని చెప్పాలి.
ఎందుకంటే.. మరే నెలలోనూ 4కి మించి సినిమాలు రిలీజైన సందర్భం లేదు. అయితే, ఏప్రిల్ లో ఇంతకుముందు రిలీజైన ఆరు చిత్రాల్లో మూడు చిత్రాలు విజయం సాధించగా.. మిగిలిన మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి.
బద్రి (2000), ఖుషి (2001), జల్సా (2008) సక్సెస్ ఫుల్ వెంచర్స్ కాగా.. జానీ (2003), తీన్ మార్ (2011), సర్దార్ గబ్బర్ సింగ్ (2016) కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మొత్తమ్మీద.. ఏప్రిల్ పవన్ కి మిక్స్ డ్ రిజల్ట్స్ అందించిన నెల అనే చెప్పాలి. మరి.. 'వకీల్ సాబ్' ఏ దారిలో వెళుతుందో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |