![]() |
![]() |

నిన్నటి తరం హీరోయిన్ "ఆమనికి హార్ట్ ఎటాక్" అనే వదంతి ఎలా పుట్టిందో ఏమో గానీ... ప్రస్తుతం ఈ పుకారు పరిశ్రమ వర్గాల్లో జోరుగా షికారు చేస్తోంది. దీనిపై ఆమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను నిక్షేపంగా, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నానని ఆమె తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లడాన్ని... 'హార్ట్ ఎటాక్'గా చిత్రీకరించడం చాలా బాధాకరమని ఆమని పేర్కొన్నారు.
హీరోయిన్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమని, వివాహానంతరం కొంత కాలం నటనకు విరామమిచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఆమని ముఖ్యపాత్ర పోషించిన 'అమ్మ దీవెన' ఇటీవల విడుదలై మంచి ప్రసంశలు పొందుతుండగా.. ఆమె కీలక పాత్రలు పోషిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'చావు కబురు చల్లగా'తో పాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.
![]() |
![]() |