![]() |
![]() |

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి వివాహం అతని ప్రేయసి మిహీకా బజాజ్‌తో ఆగస్ట్ 8న జరగనున్నది. ఈ మేరకు వీడియో రూపంలో శుభలేఖను రూపొందించి, అతిథులకు పంపిస్తున్నారు. మాయాబజార్‌లో బలరామకృష్ణులు మాయాదర్పణంలో తమకు ఇష్టమైన వారిని చూసే సన్నివేశాన్ని ఇందుకు ఎంచుకున్నారు. బలరాముడు దర్పణాన్ని తెరవగా రానా కనిపిస్తే, కృష్ణుడు దర్పణాన్ని తెరిచినప్పుడు మిహీక కనిపించింది. 2020 ఆగస్ట్ 8 స్థిరవారం (శనివారంకు బదులు ఈ పేరు వాడారు) హైదరాబాద్‌లోని ఖాజగూడలో ఉన్న చైతన్య ఎన్‌క్లేవ్‌లో ఈ వేడుక జరుగుతుందని ఆ ఇన్విటేషన్‌లో తెలియజేశారు.
మే 21న రానా, మిహీకాల వివాహాన్ని ఖాయం చేస్తూ రామానాయుడు స్టూడియోస్‌లో రోకా వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో ఇరువురి కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆగస్ట్ 8న జరిగే వివాహ వేడుకకు కూడా కొద్దిమంది అతిముఖ్యమైన సన్నిహితులు, స్నేహితులు, బంధువులను మాత్రమే అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. చైతన్య ఎన్‌క్లేవ్‌లో విశాలమైన హాలులో కొవిడ్ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ వేడుకను జరుపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు రానా తల్లిదండ్రులు సురేశ్‌బాబు, లక్ష్మి.. మిహీకా తల్లిదండ్రులు సురేశ్, బంటీ బజాజ్.
![]() |
![]() |