![]() |
![]() |

ముల్లును ముల్లుతోనే తీయాలి అనేది ఓ తెలుగు సామెత! రామ్ గోపాల్ వర్మ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అదే రూటులో వెళుతున్నారు. మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో విధంగా బురదజల్లడానికి ప్రయత్నించే వర్మ, తాజాగా జనసేన పార్టీ ఓటమిని ప్రధానాంశంగా చేసుకుని సెటైరికల్ సినిమా 'పవర్ స్టార్' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. అదే సమయానికి వర్మ వ్యవహారశైలిని ఎండగట్టే విధంగా పవన్ అభిమానులు తెరకెక్కిస్తున్న 'పరాన్నజీవి' కూడా విడుదల కానుంది.
షకలక శంకర్ ప్రధాన పాత్రలో 'బిగ్ బాస్' ఫేమ్ నూతన్ నాయుడు దర్శకత్వంలో సీఎస్ నిర్మిస్తున్న సినిమా 'పరాన్నజీవి'. ఇంతకుముందు జబర్దస్త్ కామెడీ షో లో వర్మ పాత్ర వేసిన షకలక శంకర్ మరోసారి ఇందులో వర్మగా కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ పేరును ప్రవన్ కళ్యాణ్ అని 'పవర్ స్టార్' సినిమా కోసం వర్మ ఏ విధంగా అయితే మార్చారో... 'పరాన్నజీవి'లోనూ అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ పేరును రామ్ లోపాల్ వర్మగా మార్చారు.
గురువారం సాయంత్రం 'పరాన్నజీవి' టీజర్ విడుదల చేశారు. 'వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య' అని షకలక శంకర్ చెప్పే డైలాగుతో టీజర్ ప్రారంభమైంది. ప్రతి డైలాగులోనూ వర్మ మీద సెటైర్స్ వేశారు.
"లక్ష్మీ బాంబు ('లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అన్నమాట)తో బాబు గారిని బద్నాం చేశాను. శివంగి శ్రీరెడ్డిని సినిమా స్టార్ల పై శివాలు ఎత్తేలా చేశాను. కత్తి మహేష్ ని కత్తి దూసేలా చేశాను. స్క్రిప్ట్ నాది... స్క్రీన్ ప్లే నాది. ఫైటింగ్ వాళ్లది... చీటింగ్ నాది" అంటూ సాగే డైలాగులు బాగా పేలాయి. వాడుకోవడంలో నాకు వావివరుసలు లేవని చెప్పే డైలాగ్ హైలైట్. ''వోడ్కా నా పెగ్గులోకి రావాలి... ఫిగరు నా పక్కలోకి రావాలి" డైలాగుతో టీజర్ ముగించారు.
![]() |
![]() |