![]() |
![]() |

'శాక్రిఫైజ్ స్టార్' సునిశిత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ ఛానళ్లకు విరివిగా అతడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో హీరోలు, హీరోయిన్లు, దర్శకులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇండస్ట్రీలో తనను ఎదగనివ్వకుండా పలువురు హీరోలు, దర్శకులు తొక్కేశారని ఆరోపణలు చేశాడు. కొందరు హీరోయిన్లు తనతో డేటింగ్ చేశారని చెప్పుకొచ్చాడు.
తమన్నా, తాను తరచూ కలిసేవాళ్లమనీ... ఒకరోజు తమన్నాకు ప్రపోజ్ చేశానని, ఆమె తండ్రి ఎటువంటి సమస్య లేదన్నారనీ... రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నామనీ సునిశిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. లావణ్యా త్రిపాఠిని పెళ్లి చేసుకుని వదిలేశానని అతడు చెప్పుకొచ్చాడు. ఈ వార్తలపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అతడిని మతిస్థిమితం లేని వ్యక్తిగా చాలామంది చూశారు. కొంతమంది అతడి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![]() |
![]() |