![]() |
![]() |

చిరంజీవి టైటిల్ రోల్ చేస్తోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్‌ను సెప్టెంబర్ నుంచి కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా సెట్స్‌పై సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు డైరెక్టర్ శివ కొరటాల, ప్రొడక్షన్ టీమ్ కష్టపడుతున్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటం, ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని షూటింగ్ జరిపే సెట్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. సోషల్ డిస్టాన్సింగ్ పాటించేలా.. సాధారణ సెట్లతో పోలిస్తే మరింత విశాలమైన స్థలంలో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. సెట్‌లో క్రిమిసంహారక యంత్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
మొత్తానికి కొవిడ్-19 బారిన పడకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోనున్నారు. అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయనే నమ్మకం కలిగాక సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షూటింగ్‌కు వెళ్లనున్నారు. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అతని జోడీగా కియారా అద్వానీ నటించే అవకాశాలున్నాయి. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న 'ఆచార్య' 2021 వేసవిలో రిలీజ్ కానున్నది.
![]() |
![]() |