![]() |
![]() |

లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ మీనన్ తీసిన పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ 'వెట్టయాడు వెలియాడు'. తెలుగులో 'రాఘవన్'గా విడుదలైంది. అందులో జ్యోతిక, కమలినీ ముఖర్జీ నటించారు. సుమారు పదిహేనేళ్ల తరవాత ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడానికి గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్లో కమల్ సరసన కీర్తీ సురేష్ నటిస్తున్నదని చెన్నైలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దాన్ని హీరోయిన్ మేనేజర్ ఖండించారు. తమను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
పోలీస్ నేపథ్యంలో గౌతమ్ మీనన్ తీసిన సినిమాలు అన్నీ విజయాలు సాధించాయి. అందుకని, 'వెట్టయాడు వెలియాడు 2' మీద ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇందులో జ్యోతిక బదులు అజిత్ హీరోగా తాను తీసిన 'ఎన్నై ఆరిందాల్'లో నటించిన అనుష్కను తీసుకోవాలని గౌతమ్ మీనన్ అనుకుంటున్నారట. మరో కథానాయికగా కీర్తీ సురేష్ పేరు వినిపించింది. అటువంటి లేదని తేలడంతో కమల్ పక్కన కథానాయికలు ఎవరనేది మళ్ళీ మొదటికి వచ్చింది.
![]() |
![]() |