![]() |
![]() |

నిస్సందేహంగా ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. లాభాలలో వాటా తీసుకోవడం అనే మాట కిలాడి కుమార్ డిక్షనరీలో లేదని బాలీవుడ్ నిర్మాతలు చెబుతుంటారు. హీరోగా ఫుల్ లెంత్ రోల్ చేస్తే శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటారని టాక్. ఒకవేళ సినిమాలో స్పెషల్ రోల్ అయినా సరే అక్షయ్ పారితోషికం తక్కువేం కాదు.
తమిళ హీరో ధనుష్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా జంటగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న 'అత్రంగీ రే'లో అక్షయ్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. రెండు వారాలు షూటింగ్ చేస్తే ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ రెండు వారాలకు ఆయన 27 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడని ముంబై సమాచారం. ఆగస్టులో 'బెల్ బాటమ్' సినిమా చిత్రీకరణకు అక్షయ్ లండన్ వెళుతున్నారు. అక్కడి నుండి వచ్చిన తర్వాత ధనుష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట.
![]() |
![]() |