![]() |
![]() |

హిందీ సీరియల్ 'హమారీ బహు సిల్క్' నిర్మాత ఇంటిముందు, ఆ సీరియల్లో లీడ్ రోల్ చేసిన జాన్ ఖాన్ సహా ఇతర నటీనటులు నిరసన వ్యక్తం చేశారు. మే నెల నుండి నిర్మాతపై సీరియల్ కాస్ట్ అండ్ క్రూ తమకు ఇవ్వవలసిన బకాయిల గురించి ఒత్తిడి చేస్తున్నారు. కొందరు డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. కానీ, నిర్మాత కనికరించలేదు. ఈ సమస్యను సీరియల్ ప్రసారం చేసిన జీ ఛానల్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇక చేసింది ఏమీ లేక... నిర్మాత ఇంటిముందు శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేశారు. నిర్మాతలు దివ్యా రాలె, సుధాన్షు త్రిపాఠి, జ్యోతి గుప్తాను ఏడాదిగా పేమెంట్స్ క్లియర్ చేయమని అడుగుతున్నా చేయడం లేదని జాన్ ఖాన్ ఆరోపించారు.
నటీనటులు, సాంకేతిక బృందానికి న్యాయంగా ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వనందుకు సీరియల్ లీడ్ రోల్ చేసిన జాన్ ఖాన్, ఇతర నటీనటులు ముంబైలోని వెరసోవాలోని నిర్మాత దివ్యా రాలె ఇంటి ముందు శాంతియుతంగా ఆందోళన, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందులోనూ కొవిడ్ మార్గదర్శకాలు పాటించారు. ఆరు గంటలు నిరసనగా ఇంటి ముందు నటీనటులు నిలబడ్డా... దివ్యా రాలె బయటకు రాలేదట. పైగా, సీరియల్ కి పని చేసిన వాళ్ళందరి ఫోన్ నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారట.
![]() |
![]() |