![]() |
![]() |

వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై ఈ రోజు కొందరు దాడి చేశారు. దమ్ము ధైర్యం ఉంటే బయటకు రావాలని ఆయనకు సవాల్ విసిరారు. రాయలేని భాషలో వర్మను బూతులు తిట్టారు. ప్రముఖ హీరో, జనసేనాని పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా 'పవర్ స్టార్' సినిమా తెరకెక్కించినందుకు నిరసనగా కొందరు ప్రేక్షకులు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వారంతా తమను తాము పవన్ అభిమానుల పేర్కొన్నట్లు సమాచారం. వర్మ ఆఫీసుకు వచ్చి గొడవ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
తన ఆఫీసుపై తాడి జరగడంతో వర్మ చాలా సంతోషంగా ఉన్నారు. జనసేన పార్టీ సభ్యులుగా చెప్పుకుంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తన ఆఫీసుపై దాడి చేయగా తమ సెక్యూరిటీ గార్డులు, పోలీసులు లాకప్ కి పంపించారని వర్మ ట్వీట్ చేశారు. తనకు మరింత పబ్లిసిటీ ఇచ్చినందుకు వాళ్ళను ముద్దు పెట్టుకోవాలని ఉందని ఆయన పేర్కొన్నారు.

![]() |
![]() |