![]() |
![]() |

`మహానటి`తో దర్శకుడిగా మన్ననలు పొందాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ దివా దీపికా పదుకొణే నటించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో `బిగ్ బి` అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తొలుత జనవరి నుంచి ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజా కథనాల ప్రకారం.. ఆగస్టు నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన చిత్రీకరణని ప్రారంభించాలని నాగ్ అండ్ టీమ్ ప్రణాళిక రచించారట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మూవీకి మిక్కీ జే మేయర్ బాణీలు అందించనున్నారు.
కాగా, ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్` ఈ ఏడాది జూలై 30న థియేటర్స్ లోకి రానుంది. ఇక `సలార్` 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కానుండగా.. `ఆదిపురుష్` 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. 2023లో ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ తెరపైకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |