![]() |
![]() |

తమిళ కథానాయకుడు సూర్యకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన చిత్రం `గజిని` (2005). సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో తెలుగులోనూ మార్కెట్ ని సంపాదించుకున్నాడు సూర్య. అయితే, `గజిని` తరువాత సూర్య - మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన `ఏళామ్ అరివు` (తెలుగులో `సెవెన్త్ సెన్స్`) రెండు భాషల్లోనూ జస్ట్ ఓకే అనిపించుకుంది. అయినప్పటికీ.. వీరిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్ డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నాడు. ఆ రెండు సినిమాల తరువాత హరి కాంబినేషన్ లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే.. తాజాగా మురుగదాస్ కెప్టెన్సీలోనూ ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని చేసేందుకు అంగీకరించాడట. త్వరలోనే సూర్య, మురుగదాస్ కాంబో మూవీకి సంబంధించి క్లారిటీ రావచ్చు. మరి.. థర్డ్ జాయింట్ వెంచర్ తో సూర్య, మురుగదాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |