![]() |
![]() |
.jpg)
కోలీవుడ్ డైరెక్టర్స్ లో వెట్రిమారన్ తీరే వేరు. మాస్ సినిమాలకూ క్లాసిక్ స్టేటస్ తీసుకురాగల దర్శకుడు వెట్రి. అంతేకాదు.. అవార్డ్ విన్నింగ్ సినిమాల స్పెషలిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. `ఆడుకళం`తో `ఉత్తమ దర్శకుడు`గా జాతీయ పురస్కారం పొందిన వెట్రి.. `అసురన్` తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేషన్ లో `వడివాసల్` చేయబోతున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
కాగా, `వడివాసల్` సెట్స్ పైకి వెళ్ళకముందే వెట్రి ఖాతాలో మరో బిగ్ టికెట్ ఫిల్మ్ చేరిందట. ఆ వివరాల్లోకి వెళితే.. ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని కొంతకాలం క్రితం కథనాలు వచ్చాయి. అయితే, వేర్వేరు ప్రాజెక్టులతో ఇద్దరు బిజీ కావడంతో అది కార్యరూపం దాల్చలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీ తరువాత వెట్రిమారన్ డైరెక్షన్ లోనే విజయ్ సినిమా చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందట.
మరి.. `ఆడుకళం`, `అసురన్`తో ధనుష్ కి `ఉత్తమ నటుడు`గా రెండు జాతీయ పురస్కారాలు తెచ్చిపెట్టిన వెట్రిమారన్.. సూర్య, విజయ్ తోనూ ఆ మ్యాజిక్ ని కొనసాగిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |