![]() |
![]() |

`జెర్సీ`.. నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ఓ మెమరబుల్ మూవీ. గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రంలో మధ్య వయస్కుడైన క్రికెటర్ రోల్ లో నాని జీవించేశాడు. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. నటుడిగా నాని కెరీర్ ని `జెర్సీ`కి ముందు, తరువాత అన్నంతగా.. ఆ సినిమా ప్రభావితం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా `ఉత్తమ ప్రాంతీయ చిత్రం`, `ఉత్తమ ఎడిటర్` విభాగాల్లో `జాతీయ పురస్కారాలు` పొంది మరోసారి వార్తల్లో నిలిచింది `జెర్సీ`.
కట్ చేస్తే.. `జెర్సీ` తరువాత నాని, గౌతమ్ మరోసారి జట్టుకట్టనున్నారని టాక్. అంతేకాదు.. దీపావళి తరువాత తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ అవుతుందని వినికిడి. త్వరలోనే నాని, గౌతమ్ సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ వస్తుంది.
కాగా, గౌతమ్ రూపొందించిన `జెర్సీ` హిందీ వెర్షన్ దీపావళి కానుకగా థియేటర్స్ లోకి రానుంది. ఇక నాని విషయానికి వస్తే `టక్ జగదీష్` ఏప్రిల్ 23న రానుండగా.. `శ్యామ్ సింగ రాయ్` ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. `అంటే.. సుందరానికీ!` త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
![]() |
![]() |