![]() |
![]() |

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు`తో కథానాయకుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి `మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి..` అనే టైటిల్ ని ఫిక్స్ అయినట్లుగా కూడా ముచ్చటించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో కూడా నవీన్ ఓ మూవీ చేయబోతున్నట్లు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తాడని టాక్. `ఛలో`, `భీష్మ`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వెంకీ.. నవీన్ కాంబో మూవీతో హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి. త్వరలోనే మహేశ్ - నవీన్ - వెంకీ కలయికలో రాబోతున్న సినిమాపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |