![]() |
![]() |

ఆదివారం దేశమంతా రంగుల పండుగను సరదాగా, సందడిగా జరుపుకున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా తాము చేసుకున్న హోలీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తమ ఫ్యాన్స్, ఫాలోయర్స్‌కు ఆ ఫొటోల ద్వారా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత అక్టోబర్‌లో ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, తాము కలిసి చేసుకున్న తొలి హోలీ వేడుకకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది.
ఆ ఫొటోలో కాజల్, గౌతమ్ ఒకరినొకరు హత్తుకొని ఉన్నారు. వారి ముఖాలపై కొద్దిగా రంగులు పూసి ఉన్నాయి. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన కాజల్, "ఈ హోలీ.. మీకూ, మీ కుటుంబానికి చాలా చాలా ఆనందాన్నీ, మంచినీ, ఆరోగ్యాన్నీ చేకూర్చాలని ఆశిస్తున్నా." అని రాసుకొచ్చింది.
.jpg)
గౌతమ్ సైతం నాలుగు ఫొటోలను కలిపి ఒక ఫ్రేమ్ ద్వారా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. దానికి "Happy Holi from us to you!" అనే క్యాప్షన్ జోడించాడు. ఆ ఇద్దరూ హోలీని సెలబ్రేట్ చేసుకున్న విధానం ఆ ఫొటోల ద్వారా తెలుస్తోంది.
.jpg)
తాము కాఫీ తాగడం దగ్గర్నుంచి ఖరీదైన డిన్నర్ డేట్స్ దాకా పలు బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను ఫొటోల ద్వారా ఆ కపుల్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తూ తామెప్పుడు ఎక్కడ ఉన్నామనే అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌కు తెలియజేస్తూ వస్తున్నారు. వారి వెడ్డింగ్, హనీమూన్ ఫొటోలు ఆన్‌లైన్‌లో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.
వర్క్ విషయానికి వస్తే, కాజల్ 'ఆచార్య' మూవీలో చిరంజీవి సరసన నటిస్తోంది. దానితో పాటు 'హే సినామిక' అనే తమిళ ఫిల్మ్‌ను దుల్కర్ సల్మాన్, అదితి రావ్ హైదరితో కలిసి చేస్తోందామె.
![]() |
![]() |