![]() |
![]() |

హీరో నితిన్ తన 37వ బర్త్‌డేని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అతడిని శుభాకాంక్షల వర్షంతో తడిపేస్తున్నారు. ఈ స్పెషల్ డేకి కేవలం అభిమానులే కాకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నితిన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. 'చెక్' మూవీలో అతడితో కలిసి నటించిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్, "Happy birthday @actor_nithiin Wishing you the most amazing year, happiness and smiles always!" అని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విషెస్ చెప్పింది. అలాగే వెంకటేశ్, రాశీ ఖన్నా, మంచు విష్ణు, మంచు మనోజ్, వెన్నెల కిశోర్ సహా అనేకమంది సెలబ్రిటీలు నితిన్‌కు స్వీట్ బర్త్‌డే నోట్స్ రాసుకొచ్చారు.

కాగా సోమవారం అర్ధరాత్రి తేదీ మారే సమయానికి నితిన్ భార్య షాలిని, కొంతమంది సన్నిహిత స్నేహితులు అతడిని సర్‌ప్రైజ్ చేశారు. "నితిన్" అని రాసున్న కేక్‌ను తీసుకొచ్చారు. షాలిని పక్కన నిల్చొని విషెస్ చెబుతుండగా ఆ కేక్ కట్ చేశాడు నితిన్. సింగర్ సునీత, రామ్ దంపతులు కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. పలు తెలుగు, తమిళ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన, పలువురు సెలబ్రిటీలకు పర్సనల్ స్టైలిస్ట్ అయిన నీరజ కోన ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. వాటికి "Happy birthday heroooo..Wishing you years of love and happiness." అనే క్యాప్షన్ జోడించారు.

తేజ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'జయం' (2002) ద్వారా హీరోగా పరిచయమయ్యాడు నితిన్. ఆ తర్వాత కాలంలో దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ ఆ, భీష్మ లాంటి హిట్ సినిమాల్లో నటించాడు. ఇటీవల వచ్చిన 'రంగ్ దే' మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. లేటెస్ట్‌గా అతను నటిస్తోన్న 'అంధాధున్' రీమేక్‌కు 'మాస్ట్రో' అనే టైటిల్‌ను ప్రకటించారు.

వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, తన సుదీర్ఘ కాల ప్రేయసి షాలిని కందుకూరిని గత ఏడాది పెళ్లాడి బ్యాచిలర్‌హుడ్‌కు స్వస్తి చెప్పాడు నితిన్.

![]() |
![]() |