![]() |
![]() |

భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్`. `బాహుబలి` సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న నెక్ట్స్ వెంచర్ కావడంతో.. అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వంటి సౌత్ స్టార్స్.. అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి నార్త్ స్టార్స్ ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మార్చి 15న అలియా భట్ బర్త్ డే స్పెషల్ గా ఆమె పోషిస్తున్న `సీత` పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన జక్కన్న అండ్ టీమ్.. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా `అల్లూరి సీతారామరాజు` లుక్ ని విడుదల చేశారు. కట్ చేస్తే.. ఏప్రిల్ 2న మరో లుక్ ని ఆవిష్కరించనున్నారని టాక్. ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే.. నటుడు అజయ్ దేవగణ్ పుట్టిన రోజు. అందుకే.. ఆ రోజు `ఆర్ ఆర్ ఆర్`లో ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది.
కాగా, విజయ దశమి కానుకగా అక్టోబర్ 13న `ఆర్ ఆర్ ఆర్` థియేటర్స్ లోకి రానుంది.
![]() |
![]() |