![]() |
![]() |

ప్రముఖ హిందీ కథానాయకుడు అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ మూవీ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు భయపడ్డారో? మరో కారణం ఏదైనా ఉందో? యూట్యూబ్‌లో ట్రైలర్‌ని ఎవరూ లైక్, డిస్ లైక్ చేయడానికి వీలు లేకుండా చేశారు. ఆ రెండు ఆప్షన్లు తీసేశారు. అయినా... కొంతమంది నెటిజన్లు వదల్లేదు. ట్విట్టర్‌లో ఏడాపెడా అక్షయ్‌ని ఏకిపారేస్తున్నారు. వింత వింతగా ట్రోల్ చేస్తున్నారు.
సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్యా రాయ్ కపూర్ నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ విడుదలైతే... దానిపై సుశాంత్ అభిమానులు డిస్ లైక్స్ జడివాన కురిపించారు. లైక్స్‌కి, డిస్ లైక్స్‌కి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేవలం డిస్ లైక్స్ కారణంగా అప్పట్లో ఆ ట్రైలర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ కారణం చేత అక్షయ్‌కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్‌కి లైక్స్, డిస్ లైక్స్ ఆప్షన్ తీసేసి ఉండవచ్చని ముంబై గుసగుస. అయితే, ట్విట్టర్‌లో చాలామంది ఈ ట్రైలర్ మీద పాజిటివ్‌గా స్పందించారు. కొందరు మాత్రం అక్షయ్‌ని కెనడియన్ అంటూ కామెంట్లు చేశారు.
నవంబర్ 9న ‘లక్ష్మీ బాంబ్’ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఆయన కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘ముని 2: కాంచన’కి హిందీ రీమేక్ ఇది.
.jpg)
![]() |
![]() |