![]() |
![]() |

ఇది బిగ్ న్యూస్. శ్రీలంక లెజెండరీ క్రికెటర్, ప్రఖ్యాత ఆఫ్-స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో ఆయన పాత్రను తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పోషించనున్నాడు. ఇటీవలే సేతుపతి సినిమా 'కా పే రణసింగమ్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. మురళీధరన్ బయోపిక్‌కు '800' అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 800 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మురళీధరన్ రికార్డ్ సృష్టించాడు. అందుకే ఆయన బయోపిక్‌కు ఆ టైటిల్ పెట్టనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2021 ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలు కానున్నది. ఈ సినిమా చేస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఉద్వేగంతో పంచుకున్నాడు విజయ్ సేతుపతి. "ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులో భాగమవుతుండటం గౌరవంగా భావిస్తున్నా. త్వరలో అప్‌డేట్ ఇస్తాను" అని పోస్ట్ చేశాడు. దాంతో పాటు స్పిన్ బౌలింగ్ చేస్తున్నట్లున్న ఒక పోస్టర్‌ను షేర్ చేశాడు.
ఇదివరకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను రానా దగ్గుబాటి నిర్మిస్తాడనే విషయం ప్రచారంలోకి వచ్చింది. అతను కూడా అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు కూడా. అయితే లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం ఈ మూవీని అతను ప్రొడ్యూస్ చేయడం లేదు. విజయ్ సేతుపతి సినిమాని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిజానికి ఈ మూవీ 2019 డిసెంబర్‌లోనే మొదలవ్వాల్సి ఉండగా, తెలీని కారణాల వల్ల అది జరగలేదు. '800' మూవీ తమిళ, తెలుగు భాషలతో పాటు మరికొన్ని భాషల్లోనూ విడుదల కానున్నది.

![]() |
![]() |