![]() |
![]() |

థియేటర్లు మూతబడటంతో ఆరు నెలలుగా వెండితెర వెలవెలబోతోంది. థియేటర్లు లేకపోతేనేం? తమను ఆరాధించే ప్రేక్షకులకు ఉల్లాసం కలిగించడానికి, వినోదం అందించడానికి హీరోయిన్లు సోషల్ మీడియాను సెలెక్ట్ చేసుకున్నారు. శీతాకాలంలో సెగలు పుట్టించే దుస్తుల్లో దర్శనం ఇస్తున్నారు.

ఇటీవల విజయ సేతుపతి సరసన నటిస్తున్న సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకున్న తాప్సి, మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సముద్రతీరంలో గల హోటల్ లో చెల్లెలు షగున్, మరొకరితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. బికినీల్లో కనిపించే కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తున్నారు.
నడుము సుందరి ఇలియానా సైతం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ వర్కవుట్ పూర్తయిన తరవాత ఆ దుస్తుల్లో ఫొటోలు పోస్ట్ చేసే గోవా బ్యూటీ... బుధవారం బికినీలో ఫొటో పోస్ట్ చేశారు. ఆమె కూడా సముద్ర తీరంలో ఎంజాయ్ చేశారు.
.jpg)
కొంతకాలంగా సినిమాలు లేనప్పటికీ... సోషల్ మీడియాలో చలాకీగా ఉంటున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆమె కూడా బికినీల్లో కొత్తగా దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. మొత్తం మీద ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తున్నారు.
![]() |
![]() |