![]() |
![]() |

దేవసేన అనుష్క శెట్టి ఇటీవలే ట్విట్టర్‌లో అడుగుపెట్టి, ఆ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. ఇది ఆమె అభిమానులందరికీ మంచి వార్త. ఈ అందాల తార తను టైటిల్ రోల్ పోషించిన 'రుద్రమదేవి' మూవీ అక్టోబర్ 9తో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్, రానా దగ్గుబాటిలకు థాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.
ఆ ఇద్దరు స్టార్లతో పాటు డైరెక్టర్ గుణశేఖర్‌పై గ్రాటిట్యూడ్‌ను వ్యక్తం చేస్తూ, "ఈ జర్నీ నాకు చాలా స్పెషల్. అల్లు అర్జున్, రానా దగ్గుబాటి.. మీరు దీన్ని వండర్‌ఫుల్‌గా మార్చారు. ఇలాంటి భారీ స్థాయిలో ఒక అద్భుతమైన చరిత్రను తెరమీదకు తీసుకొచ్చిన డైరెక్టర్ గుణశేఖర్ గారు, ఆయన టీమ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'రుద్రమదేవి' ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరికీ కంగ్రాట్స్" అని ఆమె ట్వీట్ చేసింది. దీంతో పాటు 'రుద్రమదేవి' పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. అందులో సింహాసనంపై అనుష్క ఠీవిగా కూర్చొని ఉంది. పోస్టర్‌లో రానా, అల్లు అర్జున్ ముఖాలు కూడా కనిపిస్తున్నాయి.

కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీరవనిత రుద్రమదేవి చరిత్రతో, బహుభాషా చిత్రంగా విడుదలైన 'రుద్రమదేవి' చిత్రంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రునిగా రానా దగ్గుబాటి, రుద్రమదేవి తండ్రి గణపతిదేవునిగా కృష్ణంరాజు నటించగా, విక్రమ్‌జిత్ విర్క్, ప్రకాశ్‌రాజ్, సుమన్, నిత్యా మీనన్, క్యాతరిన్ ట్రెసా కీలక పాత్రలు పోషించారు.
![]() |
![]() |