![]() |
![]() |

ఇది షాకింగ్ న్యూస్. టాప్ తమిళ కమెడియన్ సూరికి సంబంధించిన ఒక విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అతను ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో రూ. 2.70 కోట్ల మేర చీటింగ్‌కు గురయ్యాడు. చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో ఒక భూమి కొనుగోలుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేశారని సూరి పేర్కొన్నాడు. వారిలో ఒక సినిమా నిర్మాత కూడా ఉండటం గమనార్హం.
తన దగ్గర వారు రూ. 2.7 కోట్లు తీసుకొని మోసం చేశారని సూరి ఆ ఫిర్యాదులో తెలిపాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రొఫెషనల్ విషయానికి వస్తే, పలు సినిమాలతో సూరి బిజీగా ఉన్నాడు. వాటిలో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ 'అన్నాత్తే', జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమాతో పాటు వెట్రిమారన్ డైరెక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.
.jpg)
![]() |
![]() |