![]() |
![]() |

ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం 'కథానాయకుడు' సినిమాలో ఎల్.వి. ప్రసాద్ పాత్రలో బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా కనిపించారు. ఆ తరువాత 'అశ్వత్థామ'లో ప్రతినాయకుడిగా నటించారు. నితిన్
కథానాయకుడిగా నటించిన 'భీష్మ'లో విలన్ పాత్ర చేశారు. ఇప్పుడీ బెంగాలీ నటుడికి మరో తెలుగు సినిమా అవకాశం వచ్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అదీ నితిన్ సినిమాయే కావడం విశేషం.
నితిన్ కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ హిందీ సినిమా 'అంధాధున్'ని రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో పోలీస్ పాత్రకు జిష్షు సేన్ గుప్తాను ఎంపిక చేశారు. హిందీలో ఆ పాత్రను
మానవ్ విజ్ పోషించారు.
గోవాలో వచ్చే నెలలో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట. నితిన్ సరసన కథానాయికగా నభా నటేష్, మరో ప్రధాన పాత్రలో తమన్నా నటించనున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్
బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది.
![]() |
![]() |