![]() |
![]() |
![]()
నటుడు సోను సూద్‌ను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా భారత ఎన్నికల కమిషన్ నియమించింది. "ఈ గౌరవానికి నాకెంతో ఆనందంగా ఉంది. దీనికి ఎంతో కృతజ్ఞుడిని. పంజాబ్‌లో పుట్టి పెరిగిన నాకు ఈ నియామకం ఎమోషనల్‌గా ఎంతో గొప్పగా అనిపిస్తోంది. నా రాష్ట్రం నన్ను చూసి గర్వించేలా చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది మరింతగా కష్టపడి పనిచేయడానికి నన్ను ప్రేరేపించింది" అని ఉద్వేగభరితంగా చెప్పారు సోను.
లాక్డౌన్ కాలంలో చేసిన మానవీయ కృషికి సర్వత్రా ప్రశంసలు అందుకున్న అనంతరం సోను సూద్‌కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. కరోనా మహమ్మారి వ్యాప్తి సందర్భంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ చిక్కుబడిపోయిన వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు పంపించడంలో సోను అవిరళ కృషి చేశారు.
అంతటితో ఆయన సామాజిక సేవ ఆగలేదు. వేలాదిమందికి ఆయన ఫేస్ షీల్డ్స్, భోజన సదుపాయాలు కల్పించారు. ఎవరైనా దేనివల్లనైనా ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వస్తే, వారికి ఆ వస్తువులను సమకూరుస్తూ దానశీలిగా పేరు తెచ్చుకున్నారు.
కొద్ది రోజుల క్రితం తన ఆత్మకథను 'ఐ యామ్ నో మెస్సయ్య' పేరిట తీసుకు రానున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |