![]() |
![]() |

ఎవడే సుబ్రమణ్యంతో తెలుగునాట దర్శకుడిగా తొలి అడుగేశారు నాగ్ అశ్విన్. మొదటి ప్రయత్నంతోనే అభిరుచి గల నిర్దేశకుడిగా ప్రశంసలు పొందారు. ఇక రెండో సినిమా మహానటితో నాగ్ అశ్విన్ స్థాయి అమాంతం పెరిగింది. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించారు అశ్విన్. మహానటి తరువాత స్వల్ప విరామం తీసుకున్న నాగ్ అశ్విన్.. ఈ సారి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తన నెక్స్ట్ వెంచర్ చేయబోతున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనుంది. 2021లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ పాన్ వరల్డ్ మూవీ.. 2022లో థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా, ఈ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ మరో స్టార్ హీరో యన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ కూడా లాక్ చేశారని టాక్. తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. త్వరలోనే యన్టీఆర్, నాగ్ అశ్విన్ మూవీపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |