![]() |
![]() |

అవకాశం కుదిరినప్పుడల్లా ఏడాదికి మూడేసి సినిమాలతో పలకరిస్తుంటారు యువ కథానాయకుడు నాని. 2011లో అలా మొదలైంది, సెగ, పిల్ల జమీందార్.. 2015లో ఎవడే సుబ్రమణ్యం, జెండాపై కపిరాజు, భలే భలే మగాడివోయ్.. 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మన్, మజ్ను.. 2017లో నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ.. ఇలా నాలుగుసార్లు ఈ తీరున ముందుకు సాగారు నేచురల్ స్టార్.
2020లోనూ ఇదే విధంగా ప్రణాళిక రచించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఆ ప్లానింగ్ వర్కవుట్ కాలేదు. దీంతో.. 2021లో త్రిచిత్ర ప్రణాళికతో సందడి చేయనున్నారు నాని. ఏడాది ఆరంభంలో టక్ జగదీష్ తో.. సంవత్సరం మధ్యలో శ్యామ్ సింగ రాయ్.. ఏడాది చివరలో వివేక్ ఆత్రేయ డైరెక్టోరియల్ తో నేచురల్ స్టార్ పలకరించనున్నారు. మరి.. ఆయా చిత్రాలతో నాని హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |