![]() |
![]() |

ప్రెజెంట్ టాలీవుడ్‌లో ఫుల్ రైజింగ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అల.. వైకుంఠపురములో, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ పాటలతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. అతని దెబ్బకు దేవి శ్రీప్రసాద్ హవా తగ్గిందనే మాట కూడా వినిపించింది. అయితే తాజాగా తమన్ కాపీ మాస్టర్ అంటూ ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. రవితేజ, శ్రుతి హాసన్ జోడీగా గోపీచంద్ మలినేని డైరెక్టర్ చేస్తున్న 'క్రాక్' సినిమాలో ఓ పాట కోసం తమన్ కట్టిన ట్యూన్ ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. 'భూమ్ బద్దలు భూమ్ బద్దలు' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సినిమాలో రవితేజ, అప్సరా రాణిపై ఐటమ్ సాంగ్‌గా తీశారు. మంగ్లీ, సింహా పాడారు.
అయితే ఈ పాట గత ఏడాదే వచ్చిన ఓ చిన్న సినిమాలోని పాటకు కాపీ అంటూ విమర్శలు వస్తున్నాయి. 'ప్రశ్నిస్తా' అనే సినిమా కోసం వర్థమాన సంగీత దర్శకుడు వెంగీ ట్యూన్ చేసిన ఆ పాట "ఏం పర్లేదు ఏం పర్లేదు" అంటూ సాగుతుంది. ఆ సాంగ్ రాసింది కూడా అతనే. గీతా మాధురి, శ్రావణ భార్గవి పాడారు. కేవలం ఒకటిన్నర సంవత్సరం క్రితమే 2019 మే 3న ఆదిత్యా మ్యూజిక్ యూట్యూబ్ చానల్‌లో ఆ సాంగ్‌ను అప్‌లోడ్ చేశారు. దాని ట్యూన్, క్రాక్‌లోని "భూమ్ బద్దలు భూమ్ బద్దలు" ట్యూన్ ఒకేలా వినిపిస్తున్నాయి.
దీంతో తమన్ ఒరిజినాలిటీపై మరోసారి సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలోనూ అతనిపై ఈ తరహా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఓ వర్థమాన సంగీత దర్శకుడి ట్యూన్‌ను కాపీకొట్టి సాంగ్‌ను కంపోజ్ చేయడం ఏమిటని సంగీత ప్రియులు తమన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. తమన్ ఏమని సమాధానమిస్తాడో...
![]() |
![]() |