![]() |
![]() |

అన్నాచెల్లెళ్ల పండగకు తెలుగువారి ఇళ్లల్లో ప్రత్యేక స్థానం ఉంది. దీపావళి పండగ అయిపోగానే భగినీహస్త భోజనం పేరిట తోబుట్టువులు పండగ జరుపుకుంటారు. అంటే, పెళ్లయిన అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ములను తమ ఇళ్లకు భోజనానికి పిలవడం ఆనవాయితీ. మధ్యాహ్నం లోగా అక్క లేదా చెల్లెలి ఇంటికి వెళ్లిన అన్నదమ్ములు రకరకాల పిండివంటలతో వారు పెట్టిన భోజనాలు చేసి, సాయంత్రం దాకా తోబుట్టువులతో కరువుతీరా కబుర్లు చెప్పుకొని తమ ఇళ్లకు తిరిగి వెళ్తుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి అద్దంపట్టే పండగగా భగినీహస్త భోజనం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఉత్తరాదిలోనూ ఇదే పండగను 'భాయ్ దూజ్' పేరిట జరుపుకుంటుండటం గమనార్హం. అలాగే బాలీవుడ్‌లోనూ పలువురు తోబుట్టువులు ఈ పండగను జరుపుకున్నారు. అలాంటి తోబుట్టువుల్లో సారా అలీఖాన్, ఆమె సోదరుడు ఇబ్రహీమ్ అలీఖాన్ కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధం కూడా చాలా బలమైనది. తమ ఇద్దరికీ సంబంధించిన పిక్చర్లు, వీడియోలను వీలున్నప్పుడల్లా షేర్ చేసుకుంటూ, ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తుంటారు. తాజాగా భాయ్ దూజ్ పండగకు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా సారా షేర్ చేసిన స్టన్నింగ్ పిక్చర్స్ ఫ్యాన్స్‌కు అమితానందాన్ని కలిగించాయి.
ఆ పిక్చర్స్‌లో అబు జాని, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన పర్పుల్ కలర్ అనార్కలి డ్రస్‌లో సారా మెరిసిపోతుండగా, పేస్టల్ గ్రీన్ ప్రింటెడ్ కుర్తాలో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు ఇబ్రహీమ్. అచ్చం అమ్మానాన్నలు అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్‌ల నోట్లో నుంచి ఊడీపడినట్లే కనిపిస్తున్నారు. ఈ పిక్చర్స్‌తో పాటు "Wishing all brothers and sisters a happy Bhai Dooj. Missing you my Iggy Potter. Can't wait to bully you again." అని క్యాప్షన్ జోడించింది సారా.
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |