![]() |
![]() |

హాకీ క్రీడాకారుడు సందీప్ కిషన్ కనిపించనున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే చండీగడ్ లో క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చారు సందీప్ కిషన్. ఈ నెలాఖరు వరకు విశ్రాంతి తీసుకుని వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తో ఆయన సినిమా చేయబోతున్నారని తెలిసింది.
సందీప్ కిషన్, జి.నాగేశ్వరరెడ్డి కలిసి 'తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్' సినిమా చేశారు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే... నాగేశ్వర్ రెడ్డి తో సినిమా చేయడం ఎంజాయ్ చేశానని, అవకాశం వస్తే
ఆయనతో మళ్లీ సినిమా చేస్తానని గతంలో సందీప్ చెప్పారు. అవకాశం రావడంతో మరోసారి వీళ్లిద్దరు సినిమా చేస్తున్నారు.
డిసెంబర్ రెండో వారంలో సందీప్ కిషన్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో రెండో సినిమా పట్టాలెక్కుతోంది అని సమాచారం. రౌడీయిజం నేపథ్యంలో వినోదంతో పాటు హీరోయిజం ఉన్న కథను దర్శకుడు సిద్ధం
చేశారట. ఇందులో సందీప్ కిషన్ రౌడీ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
![]() |
![]() |