![]() |
![]() |

ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినీ ప్రియులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా 'ద సూసైడ్ స్క్వాడ్'లో వెటరన్ యాక్షన్ మెగాస్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ నటించనున్నారు. ఈ విషయాన్ని గత వారమే స్టాలోన్ షేర్ చేసుకోగా, లేటెస్ట్‌గా ఆ మూవీ డైరెక్టర్ జేమ్స్ గన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ధ్రువీకరించాడు. ఓ బార్‌లో తామిద్దరూ కలిసిన ఫొటోను షేర్ చేసిన జేమ్స్ గన్, "నా ఫ్రెండ్ సిల్వెస్టర్ స్టాలోన్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఇష్టపడతాను. అందుకు ఇవాళ 'ద సూసైడ్ స్క్వాడ్'లో మా పని మినహాయింపు కాదు. స్టాలోన్ ఒక ఐకానిక్ మూవీ స్టార్ అయినప్పటికీ, ఆయన ఎంతటి అమేజింగ్ యాక్టర్ అనే విషయం చాలా మంది జనానికి తెలీదు." అని రాసుకొచ్చాడు.
జేమ్స్ డైరెక్ట్ చేసిన 'గార్డియన్స్ ఆఫ్ ద గాలక్సీ 2'లో స్టాకర్ ఓగోర్డ్‌గా స్టాలోన్ అతిథి పాత్రలో కనిపించారు. సెట్స్‌పై అప్పుడు ఆ ఇద్దరి మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. క్లైమాక్స్ అయిపోయాక వచ్చే పలు క్రెడిట్ సీన్స్‌లోనూ స్టాలోన్ దర్శనమిచ్చారు. 'ద సూసైడ్ స్క్వాడ్'లో స్టాలోన్ క్యారెక్టర్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. అయితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆయన డీసీ వైపు దూకడం గమనించాల్సిన విషయం.
షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2021 ఆగస్ట్ 6న విడుదల కావాలి. ఇందులో జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బా, మార్గోట్ రాబీ, పీటర్ కాపల్డీ, నాథన్ ఫిలియన్, మైఖేల్ రూకర్, జోయల్ కిన్నామన్, షాన్ గన్, జే కోర్ట్‌నీ లాంటి భారీ తారాగణం నటిస్తోంది.
![]() |
![]() |