![]() |
![]() |

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం 'పుష్ప'. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ట్రక్ డ్రైవర్ పుష్పరాజ్ క్యారెక్టర్‌లో బన్నీ కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోదావరి ప్రాంతంలోని మారేడుమల్లి అడవుల్లో సోమవారం నుంచి జరగనుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని ఓ రిసార్ట్‌లో యూనిట్ మెంబర్స్ కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నారు.
బన్నీ కూడా సోమవారం నుంచే షూటింగ్‌లో పాల్గొననున్నాడు. దాని నిమిత్తం ఇప్పటికే ఆయన రాజమండ్రి చేరుకున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ కంటే ముందుగానే ఈ సినిమాని ప్రారంభించి, కొన్ని ట్రయల్ సీన్స్ తీశారు. 'పుష్ఫ' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి లేకపోయినట్లయితే ఈ సరికే షూటింగ్ కంప్లీట్ అయివుండేది.
కాగా ఈ సినిమాలో విలన్‌గా నటించాల్సి ఉన్న తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి గౌరవంగా తప్పుకున్నాడు. ఆ క్యారెక్టర్ కోసం ఎవర్ని తీసుకున్నారనేది ఇంకా వెల్లడి కాలేదు. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబోలో తయారవుతున్న ఈ మూడో సినిమాపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి.
![]() |
![]() |