![]() |
![]() |
-a.jpg)
చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం ఆలస్యం.. వారం తిరిగేసరికల్లా భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్‌కు చెక్కేసింది. మాల్దీవుల్లో భర్తతో ఎంజాయ్ చేస్తోంది. శనివారమే తన పాస్‌పోర్ట్ పౌచ్‌లను షేర్ చేసిన 'బ్యాగ్స్ ఆర్ ప్యాక్డ్' అనీ, 'రెడీ టు గో' అనీ చెప్పిన ఆమె ఆదివారం మాల్దీవుల్లో ప్రత్యక్షమైంది. అక్కడి బీచ్‌లో భర్త తనను కౌగలించుకొని వున్న పిక్చర్తో పాటు, సింగిల్‌గా దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఫ్లవర్ డిజైన్ ఉన్న రెడ్ కలర్ గౌన్, కళ్లకు గాగుల్స్, తలకు హ్యాట్‌తో హాట్ హాట్‌గా కనిపిస్తోంది కాజల్. మరోవైపు గౌతమ్ చాలా సింపుల్‌గా వైట్ కలర్ నెక్ టీషర్ట్, బ్రౌన్ కలర్ షార్ట్స్ ధరించాడు. ఆ పిక్చర్స్‌కు "కాన్రాడ్ మాల్దీవ్స్ యు బ్యూటీ" అనే క్యాప్షన్ జోడించింది కాజల్. అన్నట్లు తన పేరును ఆమె కాజల్ కిచ్లుగా మార్చుకున్నట్లు పాస్‌పోర్ట్ పౌచ్‌ల ద్వారా ఆమె చెప్పింది.
.jpg)
.jpg)
టాలీవుడ్ ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వనున్న కాజల్
అక్టోబర్ 30న ముంబైలో జరిగిన కాజల్ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా తనకు హీరోయిన్గా ఇంతటి పేరు రావడానికి కారణమైన టాలీవుడ్‌లోని సన్నిహితులకు, స్నేహితులకు పార్టీ ఇవ్వాలని కాజల్ డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. భర్తతో కలిసి హనీమూన్ ప్లాన్ చేసిన ఆమె అక్కడ్నుంచి వచ్చాక ఈ పార్టీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి జోడీగా 'ఆచార్య' మూవీలో నటిస్తోంది. ఆయనతో ఆమెకు ఇది రెండో చిత్రం. ఇదివరకు 'ఖైదీ నంబర్ 150'లో ఆ ఇద్దరూ కలిసి నటించారు. 'ఆచార్య' మూవీ షూట్ సోమవారం నుంచి అంటే నవంబర్ 9 నుంచి జరగనున్నది. ఈ మూవీ సెట్లోకి ఈ నెలాఖరున కాజల్ వస్తుందని సమాచారం. ఆ టైమ్‌లోనే ఆమె మ్యారేజ్ పార్టీ ఇచ్చే అవకాశాలున్నాయి.
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |